![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 నిన్నటి వరకు టాస్క్, ఎలిమినేషన్, నామినేషన్ అంటు ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఒక్కో కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తుంటే వాళ్ళ మధ్య బాండింగ్ అంతా బిగ్ స్క్రీన్ పై చూస్తూ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకనే ఫ్యామిలీ వీక్ కి ఇంత క్రేజ్.
ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివాజీ పెద్ద కొడుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. హౌస్ లో అందరు మాములుగా ఎవరి పనుల్లో వారున్నప్పుడు.. శివాజీ మీరు మెడికల్ రూమ్ కి రండి అని బిగ్ బాస్ అనగానే.. ఒకే బిగ్ బాస్ అంటూ శివాజీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ శివాజీని చూసి.. నొప్పి ఏం అయినా ఉందా? అని అడిగాడు. కాస్త ఉందని శివాజీ చెప్తాడు. ఒక రెండు మూడు రోజుల్లో అంతా సెట్ అవుతుందని డాక్టర్ చెప్పడంతో.. ఎస్ ఐ విష్.. నేను ఆడతానని శివాజీ చెప్పి బయటకు వస్తుంటాడు. అప్పుడే నాన్న అని వెంకట్ అనగానే.. వెనక్కి తిరిగి చూస్తాడు శివాజీ. మాస్క్ గ్లాసెస్ అన్నీ తీసేసిన వెంకట్ ని చూసి శివాజీ హత్తుకొని ఏడ్చేశాడు. కాసేపటికి శివాజీ, వెంకట్ బయటకు వచ్చి.. నా కొడుకు అంటు హౌస్ మేట్స్ తో శివాజీ చెప్పడంతో అందరు మోస్ట్ సర్ ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఇక పల్లవి ప్రశాంత్ పరుగున వెళ్ళి హత్తుకున్నాడు. శోభాశెట్టి, అమర్ దీప్, భోలే అందరు సర్ ప్రైజ్ అయ్యారు. ఇక అందరిని కలిసాక శివాజీతో ఒంటరిగా మాట్లాడాడు వెంకట్. నువ్వు వస్తావనుకోలేదు. తమ్ముడు వస్తాడనుకున్నాను. నీకు సిగ్గు కదా అని శివాజీ అనగానే.. నాకు యూనివర్సిటీది డేట్ 8th కి ఉంది. మళ్ళీ నువ్వు వచ్చేసరికి కలిసే వీలుంటదో ఉండదో అని వచ్చానని వెంకట్ అనగానే.. శివాజీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇది బిగ్ బాస్ సీజన్-7 లోనే మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అవుతుంది.
శివాజీ కొడుకు వెంకట్ బయటకు వచ్చే ముందు హౌస్ లో పల్లవి ప్రశాంత్, యావర్ లతో కాకుండా మిగతా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండని అనగానే.. సరేనని అన్నాడు శివాజీ. ఇంకా కొన్ని మాటలు జారుతున్నాయి, అంటే మన ఇంట్లో మీరు ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడుతున్నారు. అది వేరేవాళ్ళు వేరేలా తీసుకుంటారని వెంకట్ అనగానే.. నేనా, నెవెర్ అంటూ శివాజీ సమాధానమిచ్చాడు. ఇక పల్లవి ప్రశాంత్, యావర్ లు బాగా చేసుకున్నారని వారికి స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు వెంకట్. ఇక కొన్ని హింట్స్ అండ్ టిప్స్ కూడా ఇచ్చాడు వెంకట్. బయటకు వచ్చేముందు ఫన్ మిస్ అవుతుంది నాన్న, మాకు ఫన్ కావాలి అంటూ వెంకట్ అనగానే.. అలాగే నాన్న ఇకనుండి చూడు ఎలాగ ఉంటానో అని శివాజీ అన్నాడు. కొడుకు ఇచ్చిన ఈ కాన్ఫిడెన్స్ తో శివాజీ ఆటతీరు మరింత మెరుగుపడే అవకాశం ఉందని తెలుస్తుంది.
![]() |
![]() |